యువకుడి దారుణహత్య
Published Sun, Jul 17 2016 10:35 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
కాకినాడ రూరల్ :
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ–పిఠాపురం ప్రధాన రహదారిలో పి.వెంకటాపురం వద్ద ఉన్న మద్యంషాపులో శనివారం అర్థరాత్రి దాటాక మద్యం తాగిన పండూరు గ్రామానికి చెందిన వలవల దుర్గాజీ(30)కి, పి.వెంకటాపురం గ్రామానికి చెందిన విత్తనాల వీరవెంకట సత్యనారాయణకు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సత్యనారాయణ మద్యం సీసా పగులగొట్టి దుర్గాజీ పీక కోసేశాడు. రక్తం కారుతుండగా, రోడ్డుపై పరుగులు తీసిన దుర్గాజీ కొంతదూరం వెళ్లి పడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement