- చిక్కాల ఎన్నిక ఇక లాంఛనమే..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
Published Thu, Mar 2 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
కాకినాడ సిటీ :
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే దీనిని అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బుధవారం నామినేషన్ల పరిశీలనలో చివరికంటా ఉత్కంఠ రేపిన స్వతంత్ర అభ్యర్థి యాట్ల నాగేశ్వరరావు గురువారం తన నామినేష¯ŒSను ఉపసంహరించుకున్నారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణకు ఉపసంహరణ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం గడువు ముగియనుండగా ఒక రోజు ముందుగానే యాట్ల బరి నుంచి తప్పుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేష¯ŒS వేసిన చిక్కాల రామచంద్రరావు ఒక్కరే మిగిలారు. దీంతో ఆయన శాసనమండలికి ఎన్నిక కావడం ఇక లాంఛనమే కానుంది.
Advertisement