ప్రాణం తీసిన విద్యుదాఘాతం
Published Thu, Feb 16 2017 12:25 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
బనగానపల్లె రూరల్ : విద్యుదాఘాతంతో పలుకూరు గ్రామానికి చెందిన చౌడం వెంకటసుబ్బయ్య(34) అనే మైనింగ్ కార్మికుడు బుధవారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. వడ్డె నాగరాజు వద్ద వెంకటసుబ్బయ్య మూడు సంవత్సరాల నుంచి నాపరాయి కోత మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గనిలో కోత మిషన్‌తో నాపరాయి కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్ గురైయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స కోసం స్థానిక వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నందివర్గం ఎస్‌ఐ హనుమంత్‌రెడ్డి..మృతుడి ఇంటి వద్దకు, ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, కుమారులు శివకృష్ణ, విక్రమ్‌లు ఉన్నారు.
Advertisement
Advertisement