‘మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు’ | rally by excise department | Sakshi
Sakshi News home page

‘మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు’

Published Mon, Jun 26 2017 9:50 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

‘మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు’ - Sakshi

‘మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు’

అనంతపురం సెంట్రల్‌ : మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితం అంధకారమవుతుందని ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ సీఐ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక సప్తగిరి సర్కిల్‌ నుంచి సుభాష్‌రోడ్డు మీదుగా టవర్‌క్లాక్, ఎక్సైజ్‌ డీసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అనంతపురం ఎక్సైజ్‌ సీఐ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజలు మత్తు పదార్థాలకు బానిస కారాదని సూచించారు. వీటి బారిన పడితే కుటుంబాలు నాశనమవుతాయని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం నిషేధం విధించిన మత్తు పదార్థాలను ప్రజలకు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ సీఐలు సత్యనారాయణ, కృష్ణ, ఎస్‌ఐ కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement