బంజారాహిల్స్ : రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో మంగళవారం అర్థరాత్రి తర్వాత చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లకుంట తిలక్‌నగర్‌కు చెందిన డి.రామకృష్ణ(31) హైటెక్‌సిటీలోని డెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై జూబ్లీహిల్స్ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 నుంచి పంజగుట్ట వైపు వెళ్తుండగా మసీదు వద్ద బైక్ స్కిడ్ అయింది.
దీంతో రామకృష్ణ కింద పడటమే కాకుండా రోడ్డు డివైడర్‌కు తల బలంగా తాకడంతో బలమైన గాయాలు అయ్యాయి. ఇది గమనించిన వాహనదారులు వెంటనే సమీపంలోని యశోదా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇంజినీర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని, ఘటనా స్థలంలో ప్రమాదాన్ని బట్టి తెలుస్తోంది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
Published Wed, Sep 28 2016 5:29 PM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM
Advertisement
Advertisement