స్నేహభావంతో మెలగాలి
ఎస్పీ ఎస్.శ్రీనివాస్ తలమడుగు (తాంసి) : పోలీసులు ప్రజలతో స్నేహభావంతో మెలగాలని ఎస్పీ ఎస్.శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం తాంసి, తలమడుగు పోలీస్‌స్టే షన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఠాణాల ఆవరణ లు, మొక్కలను పరిశీలించారు. పరిశుభ్రత విషయంలో ఎస్సైలను అభినందించారు. వారితో మాట్లాడి కేసుల వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆత్మహత్యల నివారణకు అవగాహన కల్పించాలన్నారు. కుటుంబయజ మాని ఆత్మహత్యకు పాల్పడితే ఆ కుటుంబం పడే కష్టాల గురించి కళాజాత ద్వారా ప్రజల కు వివరించాలన్నారు. బహిర్భూమికి బయటకు వెళ్లరాదని, ఇంటింటా మరుగుదొడ్డి ని ర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చూడాలన్నారు. పోలీసులంటే ప్రజలు భయం వీడి స్నేహభావంతో మెలిగే లా కృషి చేయాలన్నారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు మోహన్, సుబ్బారావు, సిబ్బంది ఉన్నారు.