టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం | tdp mla chintamaneni prabhakar again controversies | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం

Published Mon, May 23 2016 1:54 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం - Sakshi

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం

ఏలూరు : వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్లీ తన ప్రతాపం చూపించారు. ప్రభుత్వ ఉద్యోగులపై తరచూ దాడులకు పాల్పడే ఆయన మరోసారి తన నోటికి పని చెప్పారు. తాజాగా అటవీ శాఖ అధికారి వినోద్ కుమార్ను ఫోన్లో అసభ్యంగా దూషించారు. నువ్వో... నేనో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే చింతమనేని సవాల్ విసిరారు. రహదారి పనులను అడ్డుకుంటే సహించేది లేదంటూ ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు.

కాగా ఎమ్మెల్యే చింతమనేని కొల్లేరు ప్రాంతంలో అటవీశాఖ నిబంధనలకు విరుద్ధంగా రహదారిని నిర్మించారు. దీనిపై ప్రశ్నించిన అధికారులపై గతంలోనే దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదు అయింది. కాగా గతంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో డి.వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement