త్రిమూర్తుల కన్నా గొప్పవాడు గురువు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) :
ప్రతి విద్యార్థి జీవితంలో గురువు ముఖ్య పాత్ర వహిస్తారని, త్రిమూర్తులు కన్నా ఆయన గొప్పవాడని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలునాయుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక రివర్‌బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో శ్రీమతి జాస్తిబుల్లెమ్మాయి డిగ్రీ కళాళాల ఫ్రెషర్స్‌డే ఉత్సాహంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ అమ్మాయిలు ఆత్మ విశ్వాçÜం కలిగి ఉండాలని, పీటీ ఉష, ఇందిరాగాంధీ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జాస్తి జనార్థనమూర్తి కళాశాల ప్రగతిని వివరించారు. మిస్ బుల్లెమ్మాయి పోటీలో గెలుపొందిన తేజస్వికి, వివిధ సాంస్కృతిక క్రీడల్లో పాల్గొన్న వారికి, రచనా వ్యాసంగంలోను గెలుపొందిన విద్యార్థినులకు బహుమతి ప్రదానం చేశారు. కరస్పాండెంట్ జాస్తి జనార్దనమూర్తి వీసీని శాలువాతో ఘనంగా సత్కరించారు. లెఫ్టినెంట్ జాస్తి మూర్తి, జేవీ శేషగిరి, కళాశాల కోశాధికారి కె.సత్యవతి, కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్స్ రమాదేవి, కోమలాదేవి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.విద్యార్థినులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. విద్యార్థినులు చేసిన స్టెప్పులు కేక పెట్టించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రెషర్స్‌డే సాగింది.