రొళ్ల (మడకశిర) : కర్ణాటక ప్రాంతం తుమకూరు, దావస్‌పేట, ఉరుడుగెర ప్రాంతాలకు చెందిన ఏడుగురు దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఎస్‌ఐ నాగన్న తెలిపారు. ఈ నెల 5న రొళ్ల పట్టణానికి చెందిన బంగారు నగల షాపు యజమాని హరిప్రసాద్ వద్దకు వచ్చిన ముఠా సభ్యులు దౌర్జన్యంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామన్నారు. పిల్లిగుండ్లు సమీపంలో ముఠా సభ్యులు గోవిందరాజు, బీవీ రఘు, ఎంఆర్ నవీన్, బీ శివప్ప, చేతన్‌కుమార్, బీఎన్ నాగరాజు, చేతన్‌లను అరెస్ట్ చేశామన్నారు. మడకశిర కోర్టులో హాజరు పర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు.