పెళ్లి వేడుకకు తెచ్చిన సప్లయర్ సామగ్రిని తిరిగి అప్పజెప్పేందుకు శంకర్‌నాయక్ ఎడ్లబండిలో వేసుకుని బయల్దేరాడు. మార్గంమధ్యలో అనుకోకుండా బెదిరిన ఎద్దులు ఉన్నపళంగా పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లాయి. దీంతో సప్లయర్ సామగ్రితో నిండుగా ఉన్న ఎద్దుల బండి ఒక్కసారిగా తిరగబడింది. సప్లయర్స్ సామగ్రి మొత్తం అతడిపై పడటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు.దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
పెళ్లింట విషాదం
Published Mon, Mar 6 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
పచ్చని తోరణం..బంధు, మిత్రుల సంబరం..మేళతాళాలు, డప్పువాయిద్యాలతో అప్పటి వరకు కళకళలాడిన పెళ్లి ఇంట ఉన్నట్లుండి విషాదం చోటు చేసుకుంది. తన చెల్లెలి వివాహ వేడుకకు తెచ్చిన సప్లయర్స్ సామాన్లు తిరిగి ఇచ్చేందుకు ఎడ్లబండిపై వెళుతుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో పెళ్లికుమార్తె సోదరుడు మృతి చెందిన ఘటన ఆదివారం పులగుట్టపల్లి చిన్న తండాలో జరిగింది.
– గుంతకల్లు రూరల్
గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లి చిన్నతండాకు చెందిన వాలేనాయక్, తిప్పమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మూడో కుమారుడైన శంకర్‌నాయక్(30)కు నాగవేణితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో వాలేనాయక్ చివరి సంతానమైన లక్ష్మీబాయి వివాహం ఆదివారం గ్రామంలో ఘనంగా జరిపించారు.

Advertisement