అనంతపురం అర్బన్: ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు నెలలో ఒక రోజు పల్లెనిద్ర చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. అధికారులు కూడా విధిగా నెలలో ఒక రోజు పల్లె నిద్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెనిద్ర సమయంలో సంబంధిత అధికారులు అక్కడున్న సమస్యలు, తీసుకున్న పరిష్కార చర్యలను విజిట్ మేనేజ్‌మెంట్ యాప్‌లో పొందుపర్చాలన్నారు.
ప్రతి కార్యాలయ అధికారి ఈ–ఆఫీసు ద్వారానే ఫైళ్లను పంపాలన్నారు. మాన్యువల్‌గా తీసుకొస్తే వెనక్కి పంపుతామన్నారు. చర్చించాల్సిన ఫైళ్లకూ ఇదే విధానం వర్తిస్తుందన్నారు. ఏపీ రియల్ టైం ఔట్‌కం మానిటరింగ్ సిస్టం ద్వారా ప్రగతి నివేదికల ఫలితాలు తెలుస్తాయన్నారు. వివిధ గ్రీవెన్స్‌ల ద్వారా అందుతున్న ప్రజా ఫిర్యాదులను వందశాతం పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు చేయాలన్నారు. అనంతరం ఆయా శాఖల పనితీరును అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, సీపీఓ వాసుదేవరావు, అధికారులు పాల్గొన్నారు.
నెలలో ఒక రోజు పల్లెనిద్ర
Published Sat, Sep 16 2017 9:36 PM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement