రేపటి నుంచి ప్రపంచ బ్యాంక్‌ బృందం పర్యటన | world bank team tour | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ప్రపంచ బ్యాంక్‌ బృందం పర్యటన

Published Wed, Sep 14 2016 10:49 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

రేపటి నుంచి ప్రపంచ బ్యాంక్‌ బృందం పర్యటన - Sakshi

రేపటి నుంచి ప్రపంచ బ్యాంక్‌ బృందం పర్యటన

విజయవాడ :  జిల్లాలో అమలు చేస్తున్న ఆధార్‌ ఆధారిత చెల్లింపు విధానంపై సమగ్ర పరిశీలన కోసం ప్రపంచ బ్యాంక్‌ బృందం  ఈ నెల 16, 17 తేదీల్లో  పర్యటించనున్నట్లు కలెక్టర్‌ బాబు.ఎ తెలిపారు. ప్రపంచ బ్యాంకు బృందం పర్యటనను పురస్కరించుకుని బుధవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కృష్ణా జిల్లా నేషనల్‌ పేమెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా చెల్లింపుల విధానంలో ప్రత్యేక గుర్తింపు పొందినట్లు చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చే ప్రపంచ బ్యాంకు బృందంలో 17 మంది సభ్యులు ఉంటరని తెలిపారు. ఈ బృందం 15వ తేదీ సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుందని, 16వ తేదీ ప్రజా పంపిణీ వ్యవస్థ, పింఛన్ల పంపిణీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వేతనాల పంపిణీ తదితర అంశాలను, 17న జిల్లాలో నూతనంగా ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలిస్తారని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖరరాజు, డీఎస్‌వో రవికిరణ్, డ్వామా పీడీ మాధవీలత, ఐసీడీఎస్‌ పీడీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement