యువత భక్తి భావంతో మెలగాలి
యువత భక్తి భావంతో మెలగాలి
Published Sat, Sep 10 2016 8:23 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
యాదగిరిగుట్ట: యువత భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మహాగణేశుడి మండపం వద్ద ఎంపీ శనివారం పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చెడు దారులు తొక్కకుండా భక్తిభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి భక్తులకు ప్రసాదం అందజేశారు. కాంత్రి యువజన సంఘం అధ్యక్షులు వాసం రమేష్ ఎంపీని సన్మానించారు. ఈ పూజల్లో ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఎంపీటీసీలు సీస కృష్ణ, గుండ్లపల్లి శత్రజ్ఞ, వార్డు సభ్యురాలు బబ్బూరి ధనలక్ష్మీ, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు కర్రె వెంకటయ్య, ఆంజనేయులు, రవీందర్‌గౌడ్, వెంకటయ్యగౌడ్, రాజేశ్వర్‌రెడ్డి, నర్సింహ, ఆంజనేయులు, సత్తయ్య, సాయి, అనిల్, అరుణ్, ప్రసాద్‌గౌడ్, అరుణ్‌గౌడ్ తదితరులున్నారు.
Advertisement
Advertisement