విలాసాలకు అలవాటై... చోరీల బాట | youth arrested | Sakshi
Sakshi News home page

విలాసాలకు అలవాటై... చోరీల బాట

Published Wed, Jan 18 2017 10:08 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

youth arrested

  • మూడు బైక్‌లతో యువకుడి అరెస్ట్‌
  • రాయవరం (మండపేట) :
    విలాసాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు చోరీల బాట పట్టాడు. బైక్‌లు చోరీ చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. రాయవరం ఎస్‌ఐ వి.సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... రాయవరం గ్రామానికి చెందిన కొవ్వూరి రవిచంద్రమణి కొంతకాలంగా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో అత్తవారింట ఉంటున్నాడు. ఇటీవల రాయవరంలో బైక్‌ చోరీకి గురైన ఘటనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసు తనిఖీలు పెంచడంతో వాహనానికి రికార్డు లేకుండా బైక్‌పై తిరుగుతున్న రవిచంద్రమణిని బుధవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ బైక్‌తో పాటు జగ్గంపేటలో మరో రెండు బైక్‌లను చోరీ చేసినట్టు అతడు అంగీకరించాడు. దీంతో అతని వద్ద నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్టు ఎస్‌ఐ  తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్‌ఐ కేవీవీ సత్యనారాయణ, హెచ్‌సీ మల్లికార్జున, సిబ్బంది పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement