హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి బలహీన వర్గాలకే దక్కాలని కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ నాయకత్వం ఆగమ్యగోచరంగా మారిందని డీఎస్ పేర్కొన్నారు. ఏపీసీసీ నాయకత్వంలో ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నదని చెప్పారు.