బీజేపీ వస్తే అరాచకమే: అక్బరుద్దీన్
తాండూరు, హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ నైజమని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో అరాచకం చెలరేగుతుందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మోడీ భారత ప్రధాని కావాలని కలలు కంటున్నాడని, అది నెరవేరడం కల్ల అన్నారు. బాబ్రీ మసీదు కూల్చి వేసిన వారిని ఇంతవరకు శిక్షించలేదని, అదే పార్లమెంటుపై దాడి చేసిన వారికి మాత్రం ఉరిశిక్ష విధించారని అన్నారు. న్యాయం, చట్టం అందరికీ సమానంగా ఉండాలని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీలు పొత్తు పెట్టుకుని దేశాన్ని దోచుకుతినాలని చూస్తున్నాయని ఆరోపించారు