కసి చూపించారు, బోణీ కూడా కొట్టలేని దుస్థితి
హైదరాబాద్ : ఊహించినట్టే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూట గట్టుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా దారుణంగా చతికిలపడింది. నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపించారు. దీంతో కాంగ్రెస్ ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోయింది.
అంతేగాక చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కనీసం బోణీ కూడా కొట్టలేని దుస్థితి ఏర్పడింది. కొన్ని జిల్లాల్లో కనీసం ఒక్క వార్డు కూడా గెలవకపోడం కాంగ్రెస్ దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి. ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందిస్తూ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. అయితే ఇవే ఫలితాలు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కావని ఆయన చెప్పుకు రావటం విశేషం.