!['పవన్... పిచ్చి ముదిరిన పిల్లోడు' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/61376857606_625x300_0.jpg.webp?itok=rRvPaEKg)
'పవన్... పిచ్చి ముదిరిన పిల్లోడు'
హైదరాబాద్: నాయకులను, ఓటర్లను ఆకర్శించడానికి చంద్రబాబు పదవులను ఎరగా వేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. బీసీలకు సీఎంలు, డిప్యూటీ సీఎంల పదవులు ఇస్తామని ఆశ పెడుతున్నారని ఆరోపించారు. సీట్ల పంపిణీలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించావని చంద్రబాబును ప్రశ్నించారు.
డబ్బు, మద్యం విచ్చల విడిగా పంచుతూ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర్రాన్ని కచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపించే శక్తి కేవలం జగన్‌కు మాత్రమే ఉందన్నారు. పవన్ ఒక అజ్ఞాని, పిచ్చి ముదిరిన పిల్లవాడని ధ్వజమెత్తారు. పవన్ తన తప్పుడు మాటలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.