పవన్ కల్యాణ్ ఓ మూర్ఖుడు | pawan kalyan is a bally, says vasireddy padma | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ ఓ మూర్ఖుడు

Published Fri, May 2 2014 12:02 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ ఓ మూర్ఖుడు - Sakshi

పవన్ కల్యాణ్ ఓ మూర్ఖుడు

* ధ్వజమెత్తిన వాసిరెడ్డి పద్మ
* వైఎస్ పాలనపై నోరెత్తే అర్హత అతనికి లేదు
* విభజనవాదుల మధ్య నిలబడి జగన్‌పై విమర్శలా?
 
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనపై నోరెత్తే అర్హత కూడా పవన్ కల్యాణ్‌కు లేదని, వాస్తవానికి అతనో మూర్ఖుడని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్‌కు ఉండేది తిక్కేనని దానికి లెక్క లేదని మండిపడ్డారు. విభజనవాదుల సేవలో తరిస్తున్న పవన్ కల్యాణ్ మరోసారి వైఎస్ పాలనపైనా, జగన్‌పైనా అరువు తెచ్చుకున్న అక్కసును వెళ్లగక్కారని అభ్యంతరం తెలిపారు.

వైఎస్ పాలనవల్లే తెలంగాణ విడిపోయిందని పవన్ కల్యాణ్ చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో పవన్ చదవలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలోనే తెలంగాణ ఆకాంక్ష మొలకెత్తిందనే వాస్తవాన్ని అందులో పొందుపర్చారని చెప్పారు. వైఎస్ వల్లనే రాష్ట్రం విడిపోకుండా నిలబడిందని, విభజనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడింది ఆయనేనని టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తారని తెలిపారు. వైఎస్ జీవించి ఉన్నపుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ తరహాలో అన్ని రాష్ట్రాలు ఉండాలని ఎన్డీయేలోని పక్షాలు కూడా భావించిన విషయం పవన్ కల్యాణ్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.
 
* వైఎస్ పాలన ఎంత గొప్పదో పవన్‌లాంటి మూర్ఖులకు తెలియకపోవచ్చుకానీ రాష్ట్ర ప్రజలు తమ గుండెల్లో పదిలం చేసుకున్నారు. మహానేత మరణిస్తే ఎన్ని గుండెలు క్షోభించాయో చూడగల్గిన మనసు, కళ్లు పవన్‌కు లేవు. పవన్ చనిపోతే ఆయన భార్య కూడా కన్నీళ్లు కార్చుతుందో లేదో తెలియదు. అసలే భార్య కన్నీరు కార్చాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది.

* వైఎస్ మరణించిన ఐదేళ్ల తరువాత కూడా జనం ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్ కాలిగోటికి కూడా సరిపోని పవన్ కల్యాణ్ మాట్లాడ్డం విచిత్రం. కేసీఆర్‌ను తిట్టక పోవడంపై కూడా పెడార్థాలు తీసే దౌర్భాగ్యం రాజకీయాల్లో నెలకొంది. జగన్ కేసీఆర్‌నూ తిట్టలేదు, పవన్ కల్యాణ్‌ను కూడా తిట్టలేదు. తెలంగాణ వచ్చింది ఇద్దరు ఎంపీలున్న  కేసీఆర్ వల్ల అని పవన్  భావిస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు.

* విభజనకు కారకుడైన మోడీని ఓ వైపు, విభజనకు లేఖ ఇచ్చి చివరిదాకా ఒత్తిడి తెచ్చిన చంద్రబాబును మరోవైపు, రాజ్యసభలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయిన సొంత అన్న చిరంజీవిని వెనుక వైపు పెట్టుకున్న పవన్ వారినేమీ అనకుండా సమైక్యం కోసం అన్ని రాష్ట్రాలు తిరిగి ముఖ్యమంత్రులను, జాతీయ నాయకులను కలిసి చివరికంటా పోరాడిన జగన్‌ను విమర్శించడం విడ్డూరం.

* పవన్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల లెక్కలో లేని మనిషి. అలాంటి వ్యక్తి గురించి జగన్  మాట్లాడాల్సిన అవసరమే లేదు. మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి అందరూ కట్టకట్టుకుని వచ్చి మాట్లాడినా జగన్‌కు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఒక్క అంగుళం కూడా తగ్గించలేరు. రాష్ట్రాన్ని నిలువునూ రెండు ముక్కలు చేస్తున్నపుడు నోరెత్తని పవన్‌కు తెలుగు పౌరుషం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement