మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విరాట్‌కొహ్లిని మ్యాచ్‌లో బౌల్డ్ చేసిన వాళ్లు చాలా చాలా అరుదు. అనుష్కశర్మ తన సుగుణాలతో, సుందరవస్త్రాలతో విరాట్‌ని పదే పదే క్లీన్ బౌల్డ్ చేసింది.
►ఇలాంటి వాటిని సెపరేటర్స్‌అంటారు. అంటే డ్రెస్ మీద ఓవర్‌కోట్ ధరించడం. గౌన్, షార్ట్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి జాకెట్ వేసుకుంటే స్పెషల్‌గా కనిపిస్తారు. చలికాలం ఈవెనింగ్ పార్టీస్‌కి క్యాజువల్ లుక్‌తో ఇలా స్పెషల్‌గా కనిపించవచ్చు.
►స్కర్ట్ మీదకు ఒక టీ షర్ట్ ధరిస్తే చాలు ఇలా పూర్తి క్యాజువల్ లుక్‌తో మెరిసిపోతారు. స్కర్ట్ మీద గోల్డ్, సిల్వర్ పెయింట్ వేశారు. గెట్ టుగెదర్ వంటి పార్టీలకు ఈ తరహా డ్రెస్ బాగా నప్పుతుంది.
►సెల్ఫ్ థ్రెడ్‌వర్క్ చేసిన నెట్‌ఫ్యాబ్రిక్ అనార్కలీ మీదకు పూర్తి కాంట్రాస్ట్ కలర్ వెల్వెట్ దుపట్టాను ఉపయోగించడంతో రిచ్ లుక్ వచ్చేసింది. దుపట్టా మీద ఎంబ్రాయిడరీ చేయడంతో పాటు అంచును కూడా అంతే గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అనార్కలీ సింపుల్ లుక్‌తో, దుపట్టా గ్రాండ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి డ్రెస్సింగ్ వెడ్డింగ్, రిసెప్షన్స్ వంటి సంప్రదాయ వేడుకలకు చీరకు బదులుగా ఎంచుకోవచ్చు.
►ఇది జకార్డ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేశారు. ఇది పూర్తిగా జిప్సీ లుక్. విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఇలాంటి కలర్‌ఫుల్ డ్రెస్సులు వేసుకుంటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గా కనిపిస్తారు.
►స్పార్క్‌లీ సీక్వెన్స్ ఆలోవర్ వర్క్ చేసిన సింగిల్ పీస్ డ్రెస్ ఇది. బెల్ట్ కూడా అలాంటిదే. దీనికి సేమ్ మ్యాచ్ అయ్యే షూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ పొనీటెయిల్ లాంటి కేశాలంకరణ బాగా నప్పుతుంది. ఈ గెటప్ వెస్ట్రన్ పార్టీలకు బాగా నప్పుతుంది.
భార్గవి కూనమ్
డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment