![పరమపద సోపాన పటంలోని ఆంతర్యమేమిటి? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/61402600966_625x300.jpg.webp?itok=QtdHOwc4)
పరమపద సోపాన పటంలోని ఆంతర్యమేమిటి?
అంతరార్థం
వెనుకటి తరం ఆటల్లో ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉండేవి. పరమపదమంటే స్వర్గం. దానికి సోపానమంటే మెట్లు. పరమపద సోపాన పటమంటే స్వర్గానికి మెట్లని ఎక్కడం ఎలాగో తెలియజేసే చిత్రమని అర్థం. రాక్షసులూ నిచ్చెనలూ పాములూ దేవతలూ... ఉండే ఈ చిత్రంలో అలా అలా పైకి వెళ్లిపోతూ వెళ్లిపోతూ అకస్మాత్తుగా పెద్దపాము నోటపడి మళ్లీ మొదటికి వచ్చేయవచ్చు లేదా మోక్షానికి పోవచ్చు. ఇలా దృష్ట- అదృష్టాల నడుమ మన జీవితముంటుందనీ, మన సంపద ఏ క్షణమైనా పెరగవచ్చు లేదా అన్నింటినీ కోల్పోయి అథఃపాతాళానికి పడిపోవచ్చు అని చెబుతూ ఒక విధమైన మానసిక ధైర్యాన్ని ఇస్తూ వ్యక్తిని తీర్చిదిద్దే ఆట పరమపద సోపాన పటం.