పాలకూర... కంటిపాప...
పరిపరి శోధన
ఆకుకూరలు కంటికి మేలు చేస్తాయని తాజా పరిశోధనలో మరోసారి తేలింది. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను రోజూ తినే వారిలో గ్లకోమా (కళ్లలో నీటికాసులు) వచ్చే అవకాశాలు ముప్పయి శాతం మేరకు తగ్గుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు నిర్వహించిన పరిశోధనలో తేలింది.
ఆకుకూరల్లో పుష్కలంగా లభించే నైట్రేట్లు కళ్లకు శక్తినిస్తాయని, వాటి ప్రభావం వల్ల కళ్లలో నీటికాసులు ఏర్పడే ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జే కాంగ్ వెల్లడిస్తున్నారు. లక్ష మందికి పైగా రోగులపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైందని ఆయన చెబుతున్నారు.