మా ఆయన బంగారం: విద్యాబాలన్ | my husbend made in gold : vidya balan | Sakshi
Sakshi News home page

మా ఆయన బంగారం: విద్యాబాలన్

Published Wed, Jul 2 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

మా ఆయన బంగారం: విద్యాబాలన్

మా ఆయన బంగారం: విద్యాబాలన్

సర్దుకుపోతాడు!
ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడమనేది సిద్దార్థలో ఎప్పుడూ చూడలేదు. ఇతరులను ప్రోత్సహించడంలో  ఆయనకు ఆయనే సాటి. ‘నేను చెప్పిందే చెల్లుబాటు కావాలి’ అనే మొండి పట్టుదల ఆయనలో లేదు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించే మంచి గుణం ఆయనలో ఉంది. అయినదానికీ కాని దానికీ హడావిడి చేయాలనుకోరు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు. సాదాసీదాగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతారు. ‘‘కలలకు ఒక హద్దు  ఉండాలి. అవి పరిమితి దాటితే అసంతృప్తితో  ఇబ్బందిలో పడతాం’’ అనే జీవితసత్యాన్ని ఇద్దరం మనస్ఫూర్తిగా నమ్ముతాము. ‘సంసారం సజావుగా సాగాలంటే సర్దుపోవాలి’ అని అందరూ అంటుంటారు. సర్దుకుపోయే గుణం ఆయనలో చాలా ఎక్కువ. ఏ పని చేసినా క్రమశిక్షణతో, నిర్మాణాత్మకంగా  చేయాలనుకుంటాను. ఈ విషయంలో నా కంటే ఆయనకే ఎక్కువ మార్కులు పడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement