వినుడు వినుడు నిక్‌నేమ్‌ల గాథ!
ప్రపంచ ప్రసిద్ధ నగరాలను ఆ పేరుతోనే కాకుండా ‘నిక్‌నేమ్’తో కూడా పిలుస్తారు. అయితే చాలామందికి ఆ నిక్‌నేమ్ ఎందుకు వచ్చిందో తెలియదు. ఈ నిక్‌నేమ్‌ల వెనుక సంఘటనలు, కథలు ఆసక్తికరంగా ఉంటాయి అని చెబుతుంది ఇంగ్లండ్‌కు చెందిన ‘జస్ట్ ది ఫ్లైట్’ అనే ఫ్లైట్స్ కంపెనీ. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాల నిక్‌నేమ్‌ల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను, విశేషాలను సేకరించి ‘21 సిటీ నిక్‌నేమ్స్ అండ్ ది స్టోరీస్ బిహైండ్ దెమ్’ పేరుతో ఇన్‌ఫర్‌మేషన్ గ్రాఫిక్స్ (ఇన్‌ఫోగ్రాఫిక్స్) రూపం ఇచ్చింది. మచ్చుకు: లండన్‌ను ‘ది ఓల్డ్ స్మోక్’ అని పిలుస్తారు.
కారణం...లండన్‌లో పొగమంచు ఎక్కువగా ఉండడం. 1952లో లండన్‌ను 5 రోజుల పాటు చుట్టు ముట్టిన పొగమంచు వల్ల 4000 మంది చనిపోయారు. న్యూయార్క్‌ను ‘ది బిగ్ యాపిల్’ అని, ప్యారిస్‌ను ‘ది సిటీ ఆఫ్ లవ్’ అని... ఇలా 21 నగరాల నిక్‌నేమ్‌లను వాటి వెనుక నేపథ్యాన్ని ఆసక్తికరంగా చెబుతుంది ‘జస్ట్ ది ఫ్లైట్’.