'హెచ్ఎండీఏలో అవినీతిని రూపుమాపుతాం'
హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ) ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు జవాబుదారిగా ఉండేలా హెఎండీఏను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, అవినీతికి ఆస్కారంలేని సంస్థాగత వ్యవస్థను హెచ్ఎండీఏ కోసం రూపొందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో హెచ్ఎండీఏ పనితీరుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై లోతైన విశ్లేషణలతో కూడిన చర్చలు జరిపారు.
హెచ్ఎండీఏ కమిషనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాలినీ మిశ్రాను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. వాటర్గ్రిడ్ కార్పొరేషన్ ఎండీగా శాలినీ మిశ్రాను నియమిస్తూ గతవారం జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.