రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు | Dr.YS Rajasekhara reddy 67 birthday celebrations in andhra pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

Published Fri, Jul 8 2016 12:52 PM | Last Updated on Sat, Jul 7 2018 2:45 PM

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలు పురస్కరించుకుని రక్తదాన శిబిరాలతోపాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నాయకులు, కార్యకర్తలు భారీ పూలమాలలు వేసి... తమ అభిమానాన్ని చాటుకున్నారు.  

అనంతపురం జిల్లా :
*పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డా. హరికృష్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.


*చిలమత్తూరులో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ సీపీ నేత నవీన్ నిశ్చల్

*అనంతపురం నగరంలో వైఎస్ జయంతి సందర్భంగా చవ్వా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

*రాయదుర్గంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టిన కాపు రామచంద్రారెడ్డి, అనంతరం ఆయన గడప గడపకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం ప్రారంభమైంది.


చిత్తూరు జిల్లా:
*బీఎన్ కండ్రిగలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించిన పార్టీ నేతలు కోనేటి ఆదిమూలం, విద్యానాథరెడ్డి


*అనుప్పల్లిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు

*కుప్పంలో పార్టీ ఇంఛార్జ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో బస్టాండ్ సర్కిల్లో వైఎస్ జయంతి సభ, అన్నదాన కార్యక్రమం


*పలమనేరులో చైర్ పర్సన్ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


*బి.కొత్తకోటలో జడ్పీటీసీ రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు


*అరగొండలో సర్పంచ్ రాజేశ్వరి ఆధ్వర్యంలో వైఎస్ జయంతి, అపోలో ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ


*తిరుపతిలో గాంధీపురంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్న భూమన కరుణాకర్ రెడ్డి

*మదనపల్లెలో దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ నిర్వహించారు.



వైఎస్ఆర్ జిల్లా :
*జమ్మలమడుగు మండలం దేవగుడిలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్సీ నారాయణరెడ్డి


*దువ్వూరులో గడప గడపకూ వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, పార్టీ నేత తిరుపాల్ రెడ్డి


*ప్రొద్దుటూరులో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. గడప గడపకూ వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని పార్టీ నేతలు ప్రారంభించారు.


*రైల్వే కోడూరులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, కె. బ్రహ్మానందరెడ్డి, సుకుమార్రెడ్డి


*పోరుమామిళ్ల మండలం గుర్రప్పగారిపల్లె నుంచి ప్రారంభమైన గడప గడపకూ వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవింద్రెడ్డి, ఎంపీపీ విజయప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ శారదమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*జమ్మలమడుగు పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన సుధీర్రెడ్డి

కర్నూలు జిల్లా :
ఎమ్మిగనూరులో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైఎస్ఆర్ సీపీ ఇంఛార్జ్ జగన్మోహన్రెడ్డి


శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
*వేదాయపాలెంలో వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి.

*కావలిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాదిమంది పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు.

*సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు

*ఆత్మకూరులో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి

*నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన పార్టీ నేత రాజ్కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్

*కొడవలూరు మండలం రాజుపాలెంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.అనంతరం ఆయన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా:
*మర్రిపూడి మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ యువసేన నాయకుడు వరికూటి అశోక్బాబు

*కనిగిరిలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బుర్రా మధుసూదన యాదవ్


గుంటూరు జిల్లా :
*క్రోసూరు అచ్చంపేట, అమరావతి, పెద్దకూరపాడు, బెల్లంకొండ సహా పలు మండలాల్లో వాడవాడలా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలుచోట్ల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేత కావటి శివనాగ మనోహరనాయడు పాల్గొన్నారు.


*వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని రైతుబజార్ సమీపంలో సేవాదళ్ జిల్లా కన్వీనర్ చిన్నపురెడ్డి ఆధ్వర్యంలోకూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు.

*పొన్నూరు మార్కెట్ సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రావి వెంకటరమణ, వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు.

*బాపట్లలో కోన రఘుపతి ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు జరిగాయి. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా వెదుళ్లపల్లి ప్రజలతో ఎమ్మెల్యే కోన రఘుపతి ముఖాముఖి నిర్వహించారు.

కృష్ణాజిల్లా :

*కండ్రిగలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ

*వైఎస్ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం, మైలవరంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో భారీ వాహనాల ర్యాలీ

*ఊర్మిళ నగర్లో వైఎస్ జయంతి వేడుకలు.. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆరిఫ్తోపాటు పలువురు కార్పొరేటర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
 

పశ్చిమగోదావరి జిల్లా :
*వైఎస్ జయంతి సందర్భంగా ఉండ్రాజవవవరం, పెరవలి, నిడదవోలు మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన పార్టీ నేత రాజీవ్కృష్ణ

*టి.నరసాపురం మండలం సింగరాజుపాలెంలో తెల్లంబాలరాజు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభం

*చింతలపూడిలో వైఎస్ జయంతి వేడుకలు... కేక్ కట్ చేసి ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు పంచిన జానకీరెడ్డి

*ఏలూరు నగర సిటీ కన్వీనర్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 50 డివిజన్లలో ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ.

*దెందులూరు నియోజకవర్గం కలపర్రులో కొటారు రామచంద్రరావు, అప్పన ప్రసాద్ ఆధ్యర్యంలో వైఎస్ జయంతి వేడుకలు.

*ఉంగుటూరు నియోజకవర్గంలో కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు

*తణుకులో మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు

*ఉండి నియోజకవర్గంలో పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం పాలకోడేరులో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభమైంది.

తూర్పుగోదావరి జిల్లా :
*వైఎస్ జయంతి సందర్భంగా బాలాజీ చెరువు సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్

*కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు

*రైతులపూడిలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసిన పార్టీ నేతల వాసిరెడ్డి జమీల్

*ప్రత్తిపాడులో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నేత మురళీ రాజు

విశాఖపట్నం జిల్లా :
*నర్సీపట్నంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఉమాశంకర్ గణేష్, కోనేటి రామకృష్ణ, ధనమ్మ పాల్గొన్నారు.

*మాడుగులలో వైఎస్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే బి.ముత్యాలనాయుడు కేక్ కట్ చేశారు. అనంతరం గడప గడపకూ వైఎస్ఆర్ కార్యాక్రమంలో ఆయన పాల్గొన్నారు.

*చోడవరం నియోజకవర్గం రోలుగుంటలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసిన కరణం ధర్మశ్రీ

*ఆర్కే బీచ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ నేతలు.

*గాజువాకలో తిప్పలనాగిరెడ్డి, గురుమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా :
*నరసన్నపేట మండలం పోతయ్య వలసలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభమైంది.

*రణస్థలం మండలం మహంతిపాలెంలో ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభం

*ఆముదాలవలస మండలం రామచంద్రాపురంలో మాజీ మంత్రి తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభం

*సీతంపేట మండలం వణుకువలసలో పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement