మే 2న ఎంసెట్ | EAMCET On May 2 | Sakshi
Sakshi News home page

మే 2న ఎంసెట్

Published Tue, Jan 5 2016 10:39 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మే 2న ఎంసెట్ - Sakshi

మే 2న ఎంసెట్

♦ తెలంగాణలో వివిధ ఉమ్మడి     {పవేశ పరీక్ష తేదీలు ఖరారు
♦ వివరాలు వెల్లడించిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి
♦ మే నెలాఖరుకు ఎంసెట్ ఫలితాలు
♦ జూన్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాలు
♦ జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు
♦ ఆలోగా వృత్తి విద్యా కోర్సుల్లో కొత్త ఫీజుల ఖరారు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 2న ఎంసెట్-2016 నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. జూన్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, జూలై 1 నుంచి తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలో నిర్వహించనున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను పాపిరెడ్డి ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న వృత్తి విద్యా కోర్సుల్లో కొత్త ఫీజులను కూడా ప్రవేశాల నాటికి ఖ రారు చేస్తామన్నారు.

ఈ అంశాన్ని తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ విద్యా సంస్థల్లో ఓపెన్ కోటా సీట్లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం కల్పించాల్సి ఉన్నందున... ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ ఎంసెట్ రాసేలా చర్యలు చేపట్టామని వివరించారు. అందుకే ఏపీ కంటే మూడ్రోజుల ముందుగా (ఏపీ ఎంసెట్ మే 5వ తేదీ) తెలంగాణ ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మే నెలాఖరుకు ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. అలాగే జాతీయస్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలతో క్లాష్ కాకుండా తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో 2016-17లో ప్రవేశాలకు సెట్ల తేదీలను, ఆయా పరీక్షల నిర్వహణ సంస్థలను ఖరారు చేసినట్లు వివరించారు. ఆయా సెట్స్ కన్వీనర్లను త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు.

 వారాలు, తిథిలతో సహా సమాచారం
 తెలంగాణలో వివిధ సెట్స్ నిర్వహణ తేదీలను వారాలు, తిథిలతో సహా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్‌ను (మే-2) సోమవారం దశమి రోజున నిర్వహించాలని నిర్ణయించింది. వాటితోపాటు ఇతర పరీక్షల తేదీల్లోనూ ఆయా వివరాలను వెల్లడించింది. ఆదివారం ఎక్కువగా జాతీయ స్థాయి పరీక్షలు ఉండటం, క్రిస్టియన్లకు ఆ రోజు ప్రార్థనలు ఉంటాయి క నుక ఎంసెట్‌ను ఆదివారం నిర్వహించవద్దని నిర్ణయించింది.

 ఫిబ్రవరి చివరి నాటికి అనుబంధ గుర్తింపు!
 ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు కూడా ఉండటంతో దీనిపై దృష్టి సారించింది. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జేఎన్‌టీయూను ఆదేశించింది.
 
 నాణ్యత.. మెరుగైన బోధనే లక్ష్యం
 రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు, మెరుగైన బోధనే ప్రభుత్వ లక్ష్యమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్ పక్కాగా తనిఖీలు చేస్తున్నాయన్నారు. గత ఏడాది కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా మూసివేసుకున్నాయని, వచ్చే విద్యా ఏడాది నాటికి మరిన్ని కాలేజీలు మూత పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలపైనా దృష్టి సారించామని, సంక్రాంతి తరువాత టాస్క్‌ఫోర్స్ కమిటీల నేతృత్వంలో తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు వసూలు చేసే ఫీజులను ఖరారు చేసేందుకు కాలేజీలు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ గడువును ఇక పెంచేది లేదని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కాలేజీల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం, కొత్త డిగ్రీ సిలబస్‌ను అమలు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement