ఎలక్ట్రీషియన్ మృతి : యాజమాన్యంపై కేసు నమోదు | electrician died case filed on company in hyderabad | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రీషియన్ మృతి : యాజమాన్యంపై కేసు నమోదు

Published Thu, Dec 24 2015 5:08 PM | Last Updated on Wed, Sep 5 2018 3:52 PM

electrician died case filed on company in hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో గురువారం ఓ కంపెనీలో ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతంతో మరణించడంతో యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. దీంతో మృతుని బంధువులు సదరు యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్లితే...నగరంలోని చంద్రాయణగుట్ట హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ జావేద్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని వెంకటేశ్వర రోటో ప్యాక్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం విద్యుదాఘాతానికి గురై జావేద్ మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించింది. దీంతో ఆగ్రహించిన మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అతడు మరణించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement