పిచ్చికుక్క స్వైర విహారం..ఐదుగురికి గాయాలు | Mad dog randomized Excursion | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైర విహారం..ఐదుగురికి గాయాలు

Published Mon, Dec 29 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

పిచ్చికుక్క స్వైర విహారం..ఐదుగురికి గాయాలు

పిచ్చికుక్క స్వైర విహారం..ఐదుగురికి గాయాలు

మల్లాపూర్: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అశోక్‌నగర్, నెహ్రూనగర్‌లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి ఐదుగురిని గాయపర్చింది. నెహ్రూనగర్‌కు చెందిన శ్రీను(28), అరుణ్ రెడ్డి(12), చరణ్(5)తో పాటు మరో ఇద్దరు కుక్క కాటుకు గురయ్యారు. వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం జరిగే వారంతపు సంతలో కుక్క స్వైర విహారం చేయడంతో చిన్న పిల్లలు, పెద్దలు పలువురు పరుగులు తీశారు.
 
చిన్నారికి గాయం  
నల్లకుంట: నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడిచేసి గాయపర్చింది. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన బి.కల్యాణ్ నాలుగేళ్ల కూతురు జ్యోతిక ఆదివారం ఉదయం ఇంటి గేట్ వద్ద ఆడుకుంటుంది. అదే సమయంలో అటుగా వచ్చిన  పిచ్చి కుక్క చిన్నారిపై దాడిచేసి పెదాలపై కరిచింది. వెంటనే చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స చేసి హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో చిన్నారిని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చిన్నారికి రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపించారు.
 
ఫీవర్‌లో 16 కుక్క కాటు, రెండు డిఫ్తీరియా కేసులు
ఫీవర్ ఆస్పత్రిలో ఆదివారం 16 కుక్క కాటు, ఓ కోతి కరిచిన కేసు నమోదైంది. బాధితుల్లో పదేళ్ల లోపు చిన్నారులు ఐదుగురున్నారు. వీరందరి గాయాలు శుభ్రం చేసిన వైద్యులు రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపించారు. అలాగే ఔట్ పేషంట్ విభాగంలో 175 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు.  వీరిలో ఐదుగురిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇన్ పేషంట్లుగా చికిత్సలు పొందుతున్న వారిలో రెండు డిఫ్తీరియా కేసులున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement