మహిళల రక్షణకు బాధ్యత లేదా: నేరెళ్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల రక్షణ బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడంలేదని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. హైదరా బాద్‌లో గురువారం ఆమె మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. కొల్లాపూర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, సమస్యలపై వివరించడానికి సమయం అడుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నరు సమయం కూడా ఇవ్వడం లేదని శారద విమర్శించారు.