'రెండు గంటలపాటు సినిమా చూపించాడు' | pawan kalyan has shown two hours movie, says shabbir ali | Sakshi
Sakshi News home page

'రెండు గంటలపాటు సినిమా చూపించాడు'

Published Sat, Mar 15 2014 12:29 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'రెండు గంటలపాటు సినిమా చూపించాడు' - Sakshi

'రెండు గంటలపాటు సినిమా చూపించాడు'

హైదరాబాద్ : సినీనటుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తన వ్యక్తిగత జీవితంలోకి వస్తే సహించేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరిస్తే... అతని వ్యక్తిగత విజయాల జోలికి పోమంటూనే కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో పవన్ పెళ్లి చేసుకోకుండా అక్రమంగా సంసారం చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు.  ఆమె తండ్రి తన దగ్గరకు వచ్చాడని, ఆసమయంలో పవన్ పెళ్లి చేసుకోవాలని తాను చెప్పానని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. ఇప్పుడు ఆమెను కూడా వదిలేశాడని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్కు మానసిక ప్రశాంతత లేదని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.

రెండు గంటలపాటు పవన్ సినిమా చూపించాడని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. పవన్ లాంటి జోకర్లు ఎంతోమంది వచ్చి వెళ్లిపోయారని ఆయన వ్యాఖ్యలు చేశారు. అతని మద్దతు ఎవరికి కావాలని.... అసలు పవన్ మద్దతు ఎవురు అడిగారని షబ్బీర్ అలీ సూటిగా ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ పవన్ మాట్లాడిన విధానం, ప్రవర్తన బాగోలేదని అన్నారు. మతిభ్రమించి మాట్లాడిన వ్యక్తిలా వ్యవహరించారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement