ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెట్టి వేధింపులు | photos in Facebook harassment | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెట్టి వేధింపులు

Published Tue, Jul 5 2016 8:13 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెట్టి వేధింపులు - Sakshi

ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెట్టి వేధింపులు

హైదరాబాద్: సహజీవనం చేసిన యువతి తర్వాత తనను పట్టించుకోవడంలేదని ఓ ఫార్మా కంపెనీ మేనేజర్ ఆమెపై కక్షగట్టాడు. గతంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టి వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...హైదరాబాద్‌కు చెందిన యువతి, కర్ణాటకకు చెందిన మహేశ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొన్ని రోజులు కలిసి పని చేశారు.

ఆ సమయంలో వారి మధ్య స్నేహం ఏర్పడి కొంతకాలం సహజీవనం చేశారు. ఇటీవల యువతికి హైదరాబాద్‌కు బదిలీ కావడంతో వారి మధ్య గ్యాప్ ఏర్పడిం ది. తనతో కలిసి ఉండాలని, లేకపోతే సహజీవనంలో ఉన్నప్పుడు కలిసి దిగిన ఫొటోలను బయటపెడతానని మహేశ్ బెదిరించడం మొదలుపెట్టాడు. ఆమె పట్టించుకోకపోవడంతో ఆ ఫొటోలను అమ్మాయి ఫేస్‌బుక్ ఖాతాలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహేశ్‌ను అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement