ఒకరి తప్పు... మరొకరికి ముప్పు
సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్
కలెక్టరేట్: రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒకరు తప్పు చేస్తే మరి కొందరికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ అన్నా రు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ( టీటీఐ) ‘ట్రాఫిక్ నియంత్రణ-నిబంధనలు’ అనే అంశం పై మంగళవారం జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ... ‘టీటీఐకి వస్తున్నప్పుడు రహదారిలో వాహనచోదకుల్ని పరిశీలించాను. అందరూ హెల్మెట్ కలిగి ఉన్నా... ధరిస్తున్న వారు తక్కువగా ఉన్నారన్నా రు. హెల్మెట్‌ను వెనుకసీటులో ఉన్న వ్యక్తి కో, పక్కనో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు కనిపించినప్పుడే తలకు ధరిస్తున్నారన్నారు.హెల్మెట్ నిబంధన మన భద్రత కోసమే అని గుర్తుంచుకోవాలన్నారు. నేను కారు నడపడం తక్కువే అయినా లెసైన్స్ నిత్యం నా వెంటే ఉంటుంది‘ అంటూ దాన్ని తీసి చూపించారు.
‘రెడ్’ ఉన్నా హారన్ ఎందుకు?
నగరంలోని అవసరం లేకుండా హారన్లు మోగిస్తూ ధ్వని కాలుష్యాన్ని పెంచుతున్నారన్నారు. ట్రాఫిక్ జంక్షన్లలో సైతం రెడ్ సిగ్నల్ పడి వాహనాలు ఆగినా వెనుక వాహనాల వారు పదేపదే హారన్లు మోగిస్తారన్నారు. మద్యం తాగి వాహనా లు నడపటం, పరిమితికి మించిన వేగం తో దూసుకుపోవడం, స్టాప్ లైన్లను క్రాస్ చేయడం మానుకోవాలని సూచించారు.
అవగాహనే ముఖ్యం: జితేందర్
ట్రాఫిక్ చీఫ్ జితేందర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ విభాగంలో పారదర్శకతను పెంచేందుకే క్యాష్ లెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాలు అవలంభిస్తున్నామన్నారు. ప్రభు త్వ ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తోందన్నారు. చలాన్లు విధించేది జరిమానాల వసూలు కోసం కాదని, నిబంధనలపై ప్రజలకు అవగాహన పెరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. విదేశాల తరహాలో నగరంలో ట్రాఫిక్ పోలీసు లేని కూడళ్లుగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఇందుకు వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ట్రాఫిక్ డీసీపీ-2 ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి హెల్మెట్ నిబంధన నుంచి మినహాయిం పు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుంకర సత్యనారాయ ణ, టీటీఐ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్లు కె.శ్రీనివాస్, పీజీ రెడ్డి, ఈవెంట్ మేనేజర్ నవీన్ పాల్గొన్నారు.