ఉప్పల్ చేరుకున్న రవితేజారెడ్డి మృతదేహం
హైదరాబాద్: అమెరికాలో బోటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందిన తెలుగు విద్యార్థి రవితేజారెడ్డి మృతదేహం శుక్రవారం ఉప్పల్లోని అతడి స్వగృహానికి చేరుకుంది. ఉన్నత విద్య కోసం రెండు నెలల క్రితమే యూఎస్ వెళ్లిన రవితేజారెడ్డి... ఈ నెల 16న బఫేల్లో నేషనల్ రివర్ పార్క్కు స్నేహితులతో కలసి వెళ్లాడు.
అక్కడ బోటింగ్ చేస్తున్న సమయంలో నదిలోపడి మరణించాడు. రవితేజాకు ఈత రాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రవితేజారెడ్డి మృతదేహన్ని అతడి స్నేహితులు భారత్కు తరలించారు. ఈ క్రమంలో నేడు అతడి స్వగృహానికి మృతదేహం చేరుకుంది. అయితే రవితేజారెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా జనగాం.
కాగా... ఉప్పల్లోని సూర్యానగర్లో అతడి కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు. రెండు నెలల క్రితమే రవితేజారెడ్డి అమెరికా వెళ్లాడని... ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని మృతుడి తల్లి సుమిత్రా విలపించారు.