తెలంగాణలో రోడ్డు ప్రాజెక్ట్లకు రూ.41వేల కోట్లు | Rs 41 thousands of crors alloted for Telangana road projects | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రోడ్డు ప్రాజెక్ట్లకు రూ.41వేల కోట్లు

Published Mon, Jan 4 2016 3:50 PM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM

తెలంగాణలో రోడ్డు ప్రాజెక్ట్లకు రూ.41వేల కోట్లు - Sakshi

తెలంగాణలో రోడ్డు ప్రాజెక్ట్లకు రూ.41వేల కోట్లు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 41 వేల కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌, విజయవాడ, హైదరాబాద్‌-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవేలకు 16 వేల కోట్లు రూపాయలు కేటాయించినట్టు చెప్పారు.

హైదరాబాద్‌లో జలరవాణా వ్యవస్థకు నావిగేషన్‌ రిపోర్టు ఇవ్వమని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ జలరవాణా వ్యవస్థ ద్వారా నేషనల్‌ హైవే, ఎయిర్‌ వే, రైల్వే కనెక్టివిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని గడ్కారీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement