వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా ఆయుధ సాయం పెరుగుతోంది. సైనిక నిఘా, లక్ష్యాలను సమర్థంగా పసిగట్టే అత్యాధునిక థర్మల్ బైనాక్యులర్స్(థర్మల్ వెపన్ సైట్స్)ను పాక్ అమ్మాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఈమేరకు 1.7 కోట డాలర్ల(ు రూ.113 కోట్లు) కాంట్రాక్టును రేథియోన్ కంపెనీకి కట్టబె ట్టింది. ఈ బైనాక్యులర్స్ ద్వారా పొగ, దుమ్ములో సైతం లక్ష్యాలను గుర్తించొచ్చు. పాక్‌కు 8 ఎఫ్-16 యుద్ధవిమానాలు, 9 ఏహెచ్-1జడ్ హెలికాప్టర్లను అమ్మాలని అమెరికా నిర్ణయించడం తెలిసిందే.