బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
లండన్ : మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూ వ్యాప్తి చెందుతోంది. దేశాధినేతలూ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షలో కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. బోరిస్ జాన్సన్ వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది. జాన్సన్ స్వీయ నిర్బంధంలో ఉన్నారని, కోవిడ్-19ను బ్రిటన్ ఎదుర్కొనే చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. కాగా బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాంకాక్‌కూ కరోనా టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన హ్యాంకాక్‌కు అదే రోజు వైరస్ లక్షణాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు.మరోవైపు బ్రిటన్ ప్రధానిని రాణి ఎలిజబెత్ కలిశారని వార్తలు రావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించే అవకాశం ఉంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,29,614కు చేరగా మృతుల సంఖ్య 23,714కు పెరిగింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 724కు పెరగ్గా, 17 మంది మరణించారు. ఈ మహమ్మారి బారి నుంచి 1,21,454 మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment