చైనా అక్క.. చెన్నై చెల్లి.. కలుసుకున్నారు! | Chennai woman seeks PM Modi's help to trace her Chinese step sister | Sakshi
Sakshi News home page

చైనా అక్క.. చెన్నై చెల్లి.. కలుసుకున్నారు!

Published Fri, May 15 2015 8:32 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

చైనా అక్క.. చెన్నై చెల్లి.. కలుసుకున్నారు! - Sakshi

చైనా అక్క.. చెన్నై చెల్లి.. కలుసుకున్నారు!

బీజింగ్: మోదీ పర్యటన సందర్భంగా చైనాకు వెళ్లి అక్కడ ఉంటున్న తన సవతి సోదరిని కలుసుకోవాలని చెన్నై మహిళ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చైనాలో ఉంటున్న తన సవతి సోదరిని ఎట్టకేలకు ఆమె కలుసుకోగలిగారు. తన సవతి సోదరి యాన్ రోసాయి(81) ఆచూకీ తెలుసుకుని, కలుసుకునేందుకు సాయం చేయాలంటూ చెన్నైకి చెందిన జెన్నిఫర్ యాన్(62) అనే మహిళ ఇటీవల ప్రధానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, అధికారుల ప్రమేయం అవసరం లేకుండానే, సోషల్ మీడియా, రేడియోల చొరవతో వారిద్దరూ ఎట్టకేలకు కలుసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ముదిమిలో ఇలా కలుసుకోగలగడంతో ఇద్దరూ భావోద్వేగంతో ఆనంద బాష్పాలు రాల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement