బ్రిటీష్-ఇండియన్ సిద్ధార్ద్ దార్ ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) లో కీలకపాత్రదారుడిగా మారాడా? అవును. ఇస్లామిక్ స్టేట్ లో బానిసగా ఉండి తప్పించుకు వచ్చిన నిహాద్ బరాకత్ ఈ విషయాన్ని చెప్తోంది. ఇవే కాకుండ ఇస్లాం పేరుతో జీహాదీలు చేసే అకృత్యాలు ఆమె మాటల్లోనే.. తనను సిద్ధార్ద్ దార్ అలియాస్ అబూ దార్ కిడ్నాప్ చేసి ఇస్లామిక్ స్టేట్ కు తరలించినట్లు ఆమె బ్రిటీష్ ముస్లీం టీవీకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపింది.
సిద్ధార్ద్ 2014లో తన భార్య, బిడ్డతో బ్రిటన్ నుంచి సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ లో చేరాడు. ప్రస్తుతం బాలిక తెలిపిన వివరాల ప్రకారం దార్ మోసుల్ అనే ప్రాంతానికి లీడర్ గా నియమితులయ్యారు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో.. ఆయన వీదేశీయుడా అని బాలికను టీవీ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఆమె అవునని సమాధానం ఇచ్చింది. అంతేకాక సిద్ధార్ద ఫోటోను ఆమెకు చూపినప్పుడు అతన్ని గుర్తుపట్టడమే కాకుండా భయంతో వణికిపోయింది. ఇక ఇంటర్వూ వద్దని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు టీవీ ప్రతినిధి తెలిపారు.
యాజిడీకి చెందిన ఎంతో మంది మహిళలను దార్ ఇస్లామిక్ స్టేట్ సెక్స్ బానిసలుగా మార్చడని, తాను వేరే ఐఎస్ వ్యక్తి వల్ల గర్భం దాల్చడానికి కారణం అతడేనని ఆమె వివరించింది. పదహారేళ్ల వయసులో బరాకత్, ఆమె కుటుంబసభ్యులు 27 మందిని బానిసలుగా బంధించినట్లు, మొదట ఆమెకు ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపారని తెలిపింది.మహిళలను జీహాదీలు రెండు భాగాలుగా విభజించారని పెళ్లయిన వాళ్లు, అవివాహితులు. వీరిలో అవివాహితులను మోసుల్ అనే ప్రాంతానికి తరలిస్తారని, బరాకత్ ను అక్కడ తరలించిన తర్వాత దార్ నీవు ఇంతకుముందే వివాహం చేసుకుని ఉండాల్సిందని తరచు అనేవాడని తెలిపింది.
బరాకత్ కుటుంబాన్ని మొత్తం ఇస్లాం స్వీకరింమని చెప్పారని లేకపోతే చంపేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది. 17 ఏళ్ల బరాకత్ ప్రస్తుతం ఉత్తర ఇరాక్ లోని ప్రజలకు ఇస్లామిక్ స్టేట్ గురించి అవగాహన కల్పిస్తోంది.