తొలి మహిళా ప్రెసిడెంట్ కమల కావొచ్చు!
• వచ్చే ఎన్నికల్లో శ్వేతసౌధం పోటీలో కాలిఫోర్నియా సెనేటర్ కమలాహ్యారిస్!
• అమెరికా మీడియాలో విశ్లేషణ
వాషింగ్టన్: అమెరికాకు తొలి మహిళా ప్రెసిడెంట్ అయ్యే అవకాశాన్ని హిల్లరీ క్లింటన్ చేజార్చుకున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఆ చాన్స్ భారత సంతతి మహిళ అరుున కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హ్యారిస్‌కు(51) దక్కే అవకాశం ఉందని ఒక మీడియా నివేదిక పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను దీటుగా ఎదుర్కొనే సత్తా ఆమెకే ఉందని ది హఫింగ్‌స్టన్ పోస్ట్ అభిప్రాయపడింది. కీలకమైన కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి ఆసియన్-నల్లజాతి పౌరురాలు కమలానే కావడం విశేషం.
తొలి నుంచి డోనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న కమలా హ్యారిస్.. ఇమిగ్రేషన్ చట్టాల కఠినతరం, వలసవాదులపై ఆంక్షలు తదితర అంశాలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నారు. ట్రంపిజాన్ని ఖండిస్తూ ఆమె ప్రకటన చేసిన మరుసటి రోజే ది హఫింగ్‌స్టన్ పోస్ట్ ఈ వ్యాసం వెలువరించింది. ‘సెనేటర్‌గా విజయం సాధించిన రోజే ఆమె చరిత్ర సృష్టించారు. రానున్న రోజుల్లో హ్యారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఆకట్టుకోనుంది.
దీనికితోడు ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడిన్ లాంటి డెమొట్రిక్ పార్టీ ప్రముఖ నాయకులు ఆమె వైపే ఉన్నారు. ఇలాంటి కలరుుకలే 2020 ఎన్నికల్లో ఆమెను అధ్యక్ష స్థానానికి ఎంపిక చేసే అవకాశాలను కల్పించనున్నారుు’ అని తన నివేదికలో అభిప్రాయపడింది. హ్యారిస్ తల్లి స్వస్థలం చెన్నై కాగా, తండ్రిది జమైకా.