నటికి తప్పిన రోడ్డు ప్రమాదం | Kris Jenner involved in car accident | Sakshi
Sakshi News home page

నటికి తప్పిన రోడ్డు ప్రమాదం

Published Thu, Aug 4 2016 3:43 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

నటికి తప్పిన రోడ్డు ప్రమాదం

నటికి తప్పిన రోడ్డు ప్రమాదం

లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ టీవీ రియాలిటీ షో నటి క్రిస్ జెన్నర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. అయితే, ఎలాంటి గాయాలు కూడా అవకుండా బయటపడింది. ఈ విషయాన్ని క్రిస్ జెన్నర్ కూతురు కైలీ జెన్నర్ తెలిపింది.

ఈ ప్రమాదం వల్ల తన తల్లికి ఏమీ కాలేదని, కంగారు పడాల్సిన పనిలేదని, తను బానే ఉందంటూ ట్వీట్ చేసింది. తన రోల్స్ రాయస్ కారులో క్రిస్ లాస్ ఎంజెల్స్ లోని కాలబసాస్ రోడ్డులో వెళుతూ 101 ప్రీవే వద్ద ఓ కారును ఢీకొట్టింది. అయితే, ఆ కారు వివరాలుగానీ, ఆ కారులోని డ్రైవర్ పరిస్థితిగానీ ఇంకా తెలియరాలేదు. కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్రిస్ మాత్రమే తన కారులో ఉంది.  ఈ ప్రమాదంలో ఆమె కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా తన మణికట్టుకు కూడా గాయం అయిందని తెలుస్తోంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement