సన్నబడినందుకు విడాకులిచ్చిన భర్త | Saudi man divorces wife over costly weight-loss operation | Sakshi
Sakshi News home page

సన్నబడినందుకు విడాకులిచ్చిన భర్త

Published Sat, May 28 2016 11:10 AM | Last Updated on Fri, Sep 28 2018 4:32 PM

సన్నబడినందుకు విడాకులిచ్చిన భర్త - Sakshi

సన్నబడినందుకు విడాకులిచ్చిన భర్త

దుబాయి: తన భార్య ఖరీదైన వెయిట్ లాస్ ఆపరేషన్ చేయించుకున్నందుకు ఆమె భర్త ఆమెకు విడాకులిచ్చాడు. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఆమె ఆపరేషన్‌కు ఏకంగా రూ. 14 లక్షల వరకు ఖర్చు చేయడంతో కళ్లు బైర్లు కమ్మిన భర్త ఈ నిర్ణయం తీసుకున్నారు.

సౌదీ రాజధాని రియాద్ లో ఉంటున్న ఈ మహిళ టీచర్ గా పనిచేస్తోంది. ఇటీవల వేరేచోటికి బదిలీ అయింది. తాను లావుగా ఉన్నానని తరచు భర్త కామెంట్ చేయడంతో, అతడికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఇంట్లో ఉన్న పొదుపు సొమ్ము మొత్తం రూ. 14 లక్షలు పెట్టి సన్నబడేందుకు ఆపరేషన్ చేయించుకుంది. అయితే.. ఆ డబ్బుతో ఆమె భర్త ఇల్లు కొనాలని అనుకున్నాడు. ఆ మొత్తాన్ని ఆమె సన్నబడేందుకు ఖర్చుచేయడంతో అతడు బాగా డిప్రెస్ అయ్యాడు. కొన్నాళ్ల పాటు ఒంటరిగానే పడుకునేవాడు. చివరకు ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ పని చేసేశాడు. అయితే.. సన్నబడినందుకు విడాకులు ఇస్తావా అంటూ పలువురు ఆ భర్త మీద మండిపడుతున్నారట. పదే పదే లావుగా ఉన్నావని కామెంట్ చేయడం వల్లే ఆమె ఆపరేషన్ చేయించుకుంది కదా అని ఆమెను సమర్థిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement