న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న క్రమంలో కోవిడ్-19ను నియంత్రించే వ్యాక్సిన్ కోసం ప్రతిఒక్కరూ వేచిచూస్తున్నారు. పలు దేశాల్లో వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు కీలక దశకు చేరగా చైనా బయోఫార్మా కంపెనీ సినోవాక్ బయోటెక్ కరోనావ్యాక్ పేరిట అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పరీక్షలో పురోగతి చోటుచేసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. తమ వ్యాక్సిన్ సురక్షితమైనదని, రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడంలో మెరుగైన సామర్థ్యం కలిగిఉంటుందని ఇప్పటివరకూ నిర్వహించిన పరీక్షల్లో తేలిందని సినోవ్యాక్ తెలిపింది.
చైనాలో నిర్వహించిన రెండు దశల పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. కరోనావ్యాక్‌కు సంబంధించి కీలకమైన మూడవ దశ పరీక్షలను బ్రెజిల్‌లో చేపట్టనున్నట్టు పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటివరకూ పరీక్షించిన వారిలో 90 శాతానికి పైగా ఎలాంటి తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని, తొలి రెండు దశల పరీక్షలను 14 రోజుల విరామంతో నిర్వహించామని వెల్లడించింది. తమ వ్యాక్సిన్‌ను పరీక్షించిన వారిలో ఇది రెండు వారాల్లో యాంటీ బాడీలను విజయవంతంగా ఉత్పత్తి చేయగలిగిందని పేర్కొంది. 18 నుంచి 59 ఏళ్ల వయసు వారిలో పూర్తి ఆరోగ్యంతో ఉన్న 743 మందిపై తొలి రెండు దశల పరీక్షలను సినోవాక్ బయోటెక్ నిర్వహించింది. చదవండి : కరోనా చికిత్సకు రూ 8.5 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment