లాగోస్: నైజీరియాలో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకొని 44 మంది మృతిచెందారు. మరో 48మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ(ఎన్ఈఎంఏ)కు చెందిన డైరెక్టర్ మహ్మద్ అబూ సలేం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఉత్తర నైజీరియాకు చెందిన జాస్ నగరంలో కొద్ది సమయం వ్యవధిలో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయని, అయితే, వీటి బారి నుంచి రక్షించే విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.