రేప్ చేసి.. పర్సు దోచుకెళ్లాడు | Uber driver arrested for raping, robbing passenger in Mexico | Sakshi
Sakshi News home page

రేప్ చేసి.. పర్సు దోచుకెళ్లాడు

Published Mon, May 9 2016 10:06 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM

రేప్ చేసి.. పర్సు దోచుకెళ్లాడు - Sakshi

రేప్ చేసి.. పర్సు దోచుకెళ్లాడు

మెక్సికో సిటీ: మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో ఓ మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారం చేసి, ఆమె నుంచి డబ్బు దోచుకెళ్లిన ఉబెర్ కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిమినల్ కోర్టు ఆదేశాలు మేరకు ఆదివారం నిందితుడిని వరోనిల్ నార్టె జైలుకు పంపారు. మే 2న జరిగిన అత్యాచార ఘటన వివరాలిలా ఉన్నాయి.

మెక్సికో సిటీలో రెస్టారెంట్లు, నైట్ క్లబ్లకు పాపులర్ అయిన కండెసా డెవలప్మెంట్లోని ఓ బార్ నుంచి వచ్చిన బాధితురాలు ఉబెర్ కారు డ్రైవర్ను పిలిచింది. అడ్రెస్ చెప్పి అక్కడకు తీసుకెళ్లాల్సిందిగా చెప్పింది. కాగా మార్గమధ్యంలో డ్రైవర్ కారు ఆపి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె పర్స్ తీసుకుని కారులోంచి బయటకు తోసివేసి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గుర్తించారు. నిందితుడిని గుర్తించడానికి బార్ యజమాని, సీసీటీవీ కెమెరా ఫుటేజీలు సాయపడ్డాయి. పోలీసులు కేసును విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement