ఎంత మందితో డేటింగ్ చేశానో లెక్కేలేదు! | actress Amber Rose speak out about her dating partners | Sakshi
Sakshi News home page

ఎంత మందితో డేటింగ్ చేశానో లెక్కేలేదు!

Published Sun, Aug 28 2016 10:44 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

ఎంత మందితో డేటింగ్ చేశానో లెక్కేలేదు! - Sakshi

ఎంత మందితో డేటింగ్ చేశానో లెక్కేలేదు!

తన చర్యలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్లల్లో నిలిచే హాలీవుడ్ నటి అంబర్ రోజ్ మరోసారి సంచలన విషయాలపై నోరు విప్పింది. నటి, మోడల్ అయిన అంబర్ రోజ్ గతంలో తన మొబైల్ ఫోన్ నెంబర్ను ట్విట్టర్లో పోస్ట్ చేయగా పెను దుమారం చెలరేగింది. వెంటనే తనకు కాల్స్ వస్తుండటంతో విషయం తెలుసుకుని ట్వీట్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా నగ్న సెల్ఫీలు పోస్ట్ చేసి తీవ్ర విమర్శల పాలైంది. తాజాగా డేటింగ్, శృంగారం సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టింది.

అమెరికా మీడియాతో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పలు ఆశ్చర్యకర విషయాలను బహిరంగంగా వెల్లడించింది. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నదో వారి సంఖ్య ఎంతో కూడా లెక్కలేదని పేర్కొంది. ప్రస్తుతం తనకు 32 ఏళ్లు అని, తాను ఎంత మందితో రాసలీలలు నడిపిందో వారి సంఖ్యను లెక్కించాల్సిన అవసరం లేదన్నది. మహిళలను ఆకర్షించడానికి మగవారు పొగడ్తల వర్షం కురిపిస్తారని, అదేవిధంగా చీటింగ్ చేస్తే తమ నుంచి ఎన్నో చివాట్లు పడతారని చెప్పింది. అయితే తమ కోసం అబద్దాలు చెబితే సులువుగా గుర్తిస్తామని కొన్నిసార్లు అలాంటి విషయాలకు తాను దూరంగా ఉంటానని తన వ్యక్తిగత విషయాలను వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement