బాహుబలి 'బిగ్' మానియా
హైదరాబాద్: బాహుబలి ఓ పెద్ద సినిమా అని అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఏయే పెద్ద విషయాలు ఉన్నాయో చూద్దాం.
►బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4250 థియేటర్లలో విడుదలైంది.
►తొలి రోజు మొత్తం 15 వేలు ఆటలు ప్రదర్శించనున్నారు.
►ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలైంది.
►తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో మొత్తం 1600 థియేటర్లలో విడుదలైంది. మొత్తం థియేటర్లలో ఇది 90 శాతం.
►తమిళనాడులో 350, కర్ణాటకలో 225 థియేటర్లలో విడుదలైంది.
►పశ్చిమ బెంగాల్ లో 100 స్క్రీన్లు.. ఇతర దేశాల్లో 135 కు పైగా థియేటర్లలో విడుదలైంది.
►మలయాళంలో కేరళలోని మాయాజాల్ సినీ కాంప్లెక్స్లో 40 షోలు ప్రదర్శితం.
►తమిళ భాషలో 19 షోలు. మొత్తం 59 షోలు.. అంటే ఇదే ఇప్పటిదాకా రికార్డు.
►ఒక్కో టికెట్ ధర రూ.8వేల దాకా అమ్ముడుపోయింది.
►ఇంతవరకు ఏ ఇండియన్ చిత్రం కూడా రూ.250 కోట్లు క్రాస్ చేయలేదు. శంకర్ - రజనీకాంత్ కాంబినేషన్ రోబో కూడా రూ.150 కోట్లే కలెక్షన్స్ సాధించింది.
►ఈ సినిమా తీయడానికి మూడేళ్లు పట్టింది. గ్రాఫిక్స్ కోసం ఆరు నెలల పాటు షిఫ్టుల వారీగా 600 మంది పని చేశారు.
►ఈ సినిమా కోసం ప్రభాస్ తన వివాహాన్ని కూడా వాయిదా వేసుకున్నారనే రూమర్ హల్ చల్ చేస్తోంది.
►మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారు.
►ఈ సినిమా పోస్టర్ 50 వేల చదరపు అడుగులతో కేరళలో ఉంచారు. ఇది గిన్నిస్ రికార్డు.
►బాహుబలి సినిమా కోసం ఆరు పెద్ద సినిమాల విడుదల వాయిదా పడింది.
►వాటిలో మహేశ్ బాబు - శ్రీమంతుడు, రవితేజ - కిక్-2, గుణశేఖర్ - రుద్రమదేవి, మంచు విష్ణు - డైనమైట్ చెప్పదగినవి.