‘బెంగాల్ టైగర్’ బంపర్ ఆఫర్ | 'Bengal Tiger' Bumper Offer | Sakshi
Sakshi News home page

‘బెంగాల్ టైగర్’ బంపర్ ఆఫర్

Published Sun, Nov 22 2015 1:01 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

‘బెంగాల్ టైగర్’ బంపర్ ఆఫర్ - Sakshi

‘బెంగాల్ టైగర్’ బంపర్ ఆఫర్

రవితేజ ‘బెంగాల్‌టైగర్’గా డిసెంబరు 10న సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. నిర్మాత కేకే రాధా మోహన్ మాట్లాడుతూ-‘‘ మా చిత్రంలోని ఐదు పాటల్లో ఏదో ఒక పాటను  పాడి HTTPS://SOUNDCLOUD.COMలో అప్‌లోడ్ చేసి srisatyasaiarts@gmail.comకు పంపించాలి. వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఈ నెల 30న జరగనున్న ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌లో బహుమతులను నటీనటులతో అందజేయిస్తాం’’ అని తెలిపారు.

‘‘ఈ ముగ్గురిలో బెస్ట్ సింగర్‌ను ఎంపిక చేసి భీమ్స్‌తో నేను చేయబోయే మరో చిత్రంలో పాట పాడే ఛాన్సిస్తా. ఈ నెల 28 వరకు ఎంట్రీలను స్వీకరిస్తాం’’ అని ‘బెంగాల్ టైగర్’ దర్శకుడు సంపత్‌నంది చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు బీమ్స్ కూడా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement