కుక్కల దాడి : హీరోయిన్‌కు తీవ్రగాయాలు | Kannada actress Parul Yadav attacked by dogs in mumbai | Sakshi
Sakshi News home page

కుక్కల దాడి : హీరోయిన్‌కు తీవ్రగాయాలు

Published Wed, Jan 25 2017 8:25 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

కుక్కల దాడి : హీరోయిన్‌కు తీవ్రగాయాలు - Sakshi

కుక్కల దాడి : హీరోయిన్‌కు తీవ్రగాయాలు

బెంగళూరు : కన్నడ సినీ సినీ హీరోయిన్‌ పారుల్‌ యాదవ్‌ ముంబయిలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబయి నగరంలోని జోగేశ్వర్‌రోడ్‌లో సోమవారం సాయంత్రం తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్‌ చేస్తుండగా అక్కడి వీధికుక్కలు పారుల్‌యాదవ్‌ పెంపుడు కుక్కపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి.

దీంతో పెంపుడు కుక్కను రక్షించే క్రమంలో పారుల్‌ యాదవ్‌ వీధికుక్కలను తరమడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో వీధికుక్కలు పారుల్‌పై దాడికి పాల్పడడంతో ఆమె తల, చేతులు, కాళ్లపై తీవ్రగాయాలయ్యాయి. గమనించిన పారుల్‌ యాదవ్‌ చెల్లెలు శీతల్‌ పారుల్‌ స్థానికుల సహాయంతో కుక్కల బారి నుండి పారుల్‌ను రక్షించి స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement