రిటైర్డ్ పోలీస్ జాగిలం ‘ప్రిన్స్’ మృతి
సాక్షి, ముంబై: 26/11 ముంబై ఉగ్రవాదుల దాడుల సమయంలో పేలుడు పదార్థాల నిల్వలను గుర్తించి అనేక మంది ముంబై ప్రజల ప్రాణాలను కాపాడిన పోలీసు డాగ్ ‘ప్రిన్స్’ మృతి చెందింది. అనారోగ్యంతో పరెల్లోని సాఖరాబాయి పరిట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. 2005 నుంచి ముంబై బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్’లో సేవలందించిన ప్రిన్స్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో రిటైర్ అయ్యింది.